నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కార్య కర్తల సంక్షేమం కోసమే కృషి చేస్తానని అది పెద్దదైన నా కార్యకర్తల కుటుంబాన్ని ఎవరైనా ఇబ్బందికి గురి చేయాలని చూస్తే ఎంతకైనా తెగిస్తానని, కార్యకర్తలే నా బలం. నా బల హీనత. అని పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. ఎంపీపీ గోగం సురేష్ అధ్యక్షతన మండల పరిధిలోని వానపాముల కళ్యాణ మండపంలో జరిగిన పెదపారుపూడి మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ దేవుని దయవల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పామర్రు నియోజకవర్గంలో పెదపారుపూడి మండలం లో అతిపెద్ద కార్యకర్తల కుటుంబాన్ని నాకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇక నుండి ప్రతి నెల ఒకసారి కార్యకర్తల సమావేశం జరుపుకుందామని మండల కేంద్రంలో ఒక ప్రత్యేకమైన ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా సత్వర ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. కార్యకర్తలంతా ఒకే తాటిపై నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వెనుకబడిన ప్రజలందరి ఆర్థిక బలోపేతానికి కృషి చేద్దామన్నారు.