స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల మేరకు రైతులను రాజులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనైడ్డి ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని రైతు పచ్చగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని ఉంటుందని గృహనిర్మాణ శాఖ మాత్యులు జోగి రమేష్ అన్నారు. పెడన మార్కెట్ యార్డ్ లో వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా జోగి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గణపవరంలో వైఎస్ ఆర్ రైతు భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కష్టాలను పూర్తిగా
తెలుసుకొని రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఆలోచనలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి విధముగా రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఒక్క పెడన నియోజకవర్గంలో, 22-23 సంవత్సరానికి గాను 24 వేల 289 మంది రైతులకు 13. 35 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు అంతేకాకుండా గత మూడేళ్లుగా మొత్తం 117. 92వరకు వారి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు అలాగే విపత్తుల సమయాలలో 23. 91 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మరియు 15. 92 కోట్లు పంటల బీమా అందించామని చెప్పారు కృష్ణా డెల్టాకు రాబోయే రోజుల్లో సంవత్సరానికి మూడు పంటలకు నీళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఉన్నారన్నారు రైతులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.