రోజూ ఒక గ్లాసు వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల అనేక సహజ ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఉదయం ఒక గ్లాసు వేడి నీళ్లను తీసుకుని అందులో నిమ్మకాయను పిండుకుని ఆ నీటిని తాగాలి. చాలా వ్యాధులు మాయమవుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. వేడి నీళ్లతో నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం తాగడం వల్ల కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చాలా రకాల ఇన్‌ఫెక్షన్‌లు సులభంగా తగ్గిపోతాయి. కిడ్నీలో రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయి. రోజూ నిమ్మరసం తాగితే జీర్ణకోశ సమస్యలు దరిచేరవు. చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు మరియు మచ్చలు మాయమవుతాయి. ఇందులోని అనేక ప్రయోజనాలు ఉన్నందున, ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.