పాకిస్థాన్‌పై దాడి చేయకుండానే దేశాన్ని అమెరికా తన బానిసగా చేసుకుందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. అమెరికా ఏర్పాటు చేసిన తొత్తు ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటి ఒప్పుకోరని అన్నారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వాన్ని దేశద్రోహులు.. అవినీతి పాలకులుగా అభివర్ణించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అమెరికా పర్యటనకు వెళ్తున్నారని, అక్కడ డబ్బులు అడుక్కుంటారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి బిలావల్ భుట్టో, ఆయన తండ్రి ఆసిఫ్ అలీ ఇద్దరూ అవినీతిపరులని అన్నారు. బిలావల్ సంపాదించుకున్న డబ్బంతా ఇతర దేశాల్లో ఉందని, అందుకే అమెరికాను టచ్ చేసే ధైర్యం చేయడని ఇమ్రాన్ అన్నారు.
అగ్రరాజ్యం అమెరికాపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ను అమెరికా బానిస చేసుకుందన్నారు. అలాగే తన హత్యకు కుట్ర జరుగుతుందన్నారు. పంజాబ్ ప్రావిన్స్ ఫైసలాబాద్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రధాని పదవి పోవడానికి అమెరికా నుంచి కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు.
అలాగే పాకిస్థాన్‌లోనూ.. విదేశాల్లోనూ తన హత్యకు కుట్ర జరుగుతోందని, తనకు ఏదైనా జరిగితే తను రికార్డ్ చేసి సురక్షిత ప్రదేశంలో ఉంచిన వీడియో మెసెజ్ ద్వారా ఆ నేరస్థుల గురించి ప్రజలకు తెలుస్తుందని ఇమ్రాన్ అన్నాడు. మ