రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరరివాలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. జూన్ 11, 1991న అరెస్టు చేయబడినప్పుడు పెరారివాలన్ అలియాస్ అరివు వయస్సు 19 ఏళ్లు. తొలుత రాజీవ్ హత్య కుట్ర కేసులో నిందితులందరికీ మరణ శిక్ష పడింది. అయితే దానిని అనంతరం యావజ్జీవ శిక్షగా సుప్రీం కోర్టు మార్చింది. తాజాగా 31 ఏళ్ల శిక్ష అనంతరం పెరరివాలన్‌ను విడుదల చేయాలని సుప్రీం ఆదేశించింది. కుట్రకు సూత్రధారి అయిన ఎల్‌టీటీఈకి చెందిన వ్యక్తి శివరాసన్ కోసం అతను రెండు 9-వోల్ట్ 'గోల్డెన్ పవర్' బ్యాటరీ సెల్‌లను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఏడాది మే 21న రాజీవ్ గాంధీని చంపిన బాంబులో ఈ బ్యాటరీలను ఉపయోగించారు.