ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క చనిపోతే చాలా మంది ఆ తర్వాత ఆ కుక్కను మర్చిపోతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ జంతు ప్రేమికుడు అలా చేయలేదు. కుక్క వర్ధంతిని నిర్వహించి తన ప్రేమను చాటుకున్నాడు. పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక చందన్ నగర్‌కు చెందిన తరుణ్ ఘోష్ దస్తీదార్‌కు జంతువులంటే చాలా ఇష్టం. గత ఏడాది మే 15వ తేదిన బిచ్చు అనే కుక్క అనారోగ్యంతో చనిపోయింది.
తనకు ఇష్టమైన బిచ్చు కుక్క మరణించి ఏడాది పూర్తవడంతో మొదటి వర్ధంతిని ఏర్పాటు చేశాడు. ఘోష్ దస్దీదార్ తమ ఇంట్లో కుక్క చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించాడు. ఆ తర్వాత తమ చుట్టుపక్కల ఉన్నటువంటి 100కు పైగా కుక్కలకు మాంసాహార భోజనాలను అందించాడు. కుక్కలపై అతనికి ఉన్న ప్రేమకు అందరూ ప్రశంసిస్తున్నారు.