జిల్లా సరిహద్దు పోలీసు చెక్‌పోస్ట్ వద్ద ఉన్న పోలీసులు అక్రమ రవాణాపై దృష్టి సారించాలని రాజంపేట డి. ఎస్. పి శివ భాస్కర్ రెడ్డి సూచించారు. బుధవారం డిఎస్పీ అన్నమయ్య జిల్లా - నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన చిట్వేలు మండలం రాజు గుంట క్రాస్‌రోడ్డు వద్ద గల సరిహద్దు చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన చిట్వేలి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల తో మాట్లాడుతూ చెక్ పోస్టుల వద్ద గట్టి తనిఖీ ఉండాలని, పొరపాటు జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కు తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.