నోటి అల్సర్ల సమస్యకు వంట గదిలో దొరికే కొన్ని ఆహార పదార్థాలతోనే చెక్ పెట్టొచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- రోజులో నాలుగైదుసార్లు తులసి ఆకులు నమలడం ద్వారా నోటి అల్సర్లకు చెక్ పెట్టవచ్చు.
- కొత్తిమీరలో మంటను తగ్గించే యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. కొత్తిమీర ఆకులను వేడి నీటిలో వేసి ఉడికించాలి. చల్లార్చిన తర్వాత ఆ రసంతో రోజుకు మూడుసార్లు పుకిలిస్తే సమస్య తగ్గుతుంది.
- ఉల్లిగడ్డలోని సల్ఫర్ గుణాలు నోటి ఆల్సర్లను తగ్గించడంలో సహాయపడతాయి. చిన్న ఉల్లిగడ్డ ముక్కను అల్సర్ అయిన చోట ఉంచినా, ఉల్లిరసంతో నోటిని పుకిలించినా ఫలితం ఉంటుంది.
- అల్సర్లు అయిన చోట తేనెను పూస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. తేనెలో ఉండే యాంటీమైక్రోబయాల్ గుణాల కారణంగా అల్సర్లకు కారణమయ్యే బ్యాక్టీరియా తొందరగా నాశనం అవుతుంది. తేనెతో పాటు కొద్దిగా పసుపు కూడా రాయొచ్చు.
- నోటిలో పుండు అయిన చోట కొబ్బరి నూనెను రాయాలి. ఎండు కొబ్బరిని నమిలినా కూడా ఫలితం ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి, అల్సర్ల సమస్య తగ్గిపోతుంది.
- నోటి అల్సర్లకు గసగసాలతో పెట్టొచ్చు. ఒక చెంచా గసగసాలను పొడి చేసి, దానికి ఒక చెంచా చక్కెరను కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి.
- తరచూ లవంగాలు నమిలితే ఆ ఘాటు వల్ల కూడా సమస్య తక్కువ అవుతుంది. కాకపోతే లవంగాల ఘాటు వల్ల మొదట మంట ఎక్కువ అవుతుంది.
- గోరువెచ్చటి నీటితో తరచూ పుకలించాలి.
- ఒకే బ్రష్‌ను ఎక్కువ కాలం వాడొద్దు. మూడు నెలలకొకసారి టూత్ బ్రష్‌ను మార్చాలి.
- విటమిన్ బీ12 తగ్గినా ఈ సమస్య వస్తుంటుంది. కాబట్టి డాక్టర్ల సూచన మేరకు బీ12 విటమిన్ టాబ్లెట్లు వాడాలి.
- నోటి అల్సర్లతో బాధపడేటప్పుడు టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.