నదిలో స్నానం చేస్తున్న 38ఏళ్ల వ్యక్తిని మొసలి లాక్కెల్లింది. రాజస్థానంలోని ఖటోలి పట్టణంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.స్థానిక ప్రజలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత వెతికినప్పటికీ వ్యక్తి ఆచూకీని కనుగొనలేక పోయారు. రాజస్థాన్‌లోని హదోటి డివిజన్‌లోని నదుల్లో మొసళ్ల ఉన్నాయి. కోటా జిల్లాలోని ఖటోలీ గ్రామం దగ్గర పార్వతి నది ప్రవహిస్తుంది. 38 ఏళ్ల యువకుడు నరేంద్ర మోడీ అలియాస్ బిల్లు రాజ్‌పుత్ గ్రామానికి చెందిన రింకు లక్ష్ తో కలిసి ఉదయం నది వద్దకు వెళ్లాడు. తొలుత బట్టలు ఉతికిన నరేంద్ర స్నానం చేయడానికి నదిలో దిగాడు. అప్పుడు ఓ పెద్ద మొసలి వచ్చి బిల్లూను నది లోపటికి లాక్కెళ్లింది.ఇదంతా అక్కడే ఉన్న తన ఫ్రెండ్స్, పలువురు గ్రామస్థులు చూస్తుండగానే జరిగింది. దీంతో వారు బిల్లు కోసం వెతుకులాడినా ఉపయోగం లేకపోవటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బుధవారం మధ్యాహ్నం వరకు బిల్లు జాడలేకపోవడంతో.. ఖటోలీ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. కోటా జిల్లా ప్రధాన కార్యాలయం నుండి సబ్‌డివిజన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా నదిలో బిల్లు ఆచూకీ కోసం వెతికించారు. అయినా బిల్లు ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ అతను సజీవంగా దొరుకుతాడనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇటీవల యూపీలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. చెరువులో స్నానానికి దిగిన ఓ చిన్నారిని మొసలి అమాంతం పట్టుకొని బలితీసుకుంది.