ఏపీలో మరో కొత్త పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం పేరు వైఎస్సార్ సంచార పశువైద్యశాల. ఈ పథకం ద్వారా పశువుల అంబులెన్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఈ అంబులెన్సుల ద్వారా పశువులకు వైద్య సేవలు అందిస్తారు. అంబులెన్సులో 15 రకాల రక్త పరీక్షలు, 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు చేసే ల్యాబ్ అందుబాటులో ఉంటుంది. పశువులు అనారోగ్యానికి గురైతే 1962 నంబర్ కు ఫోన్ చేయవచ్చు. ఇది టోల్ ఫ్రీ నంబర్. వెంటనే అంబులెన్సు ద్వారా వచ్చి వైద్యులు సేవలందిస్తారు.