అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ తెలిపారు.
1. చోడవరం నుండి పి. యస్ పేట, తిమ్మన పాలెం మీదుగా కె. బి రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల 83 లక్షలు రూపాయలు మంజూరు.
2. అంబేరు పురం నుండి రాయపురాజుపేట రోడ్డు కు 83 లక్షలు రూపాయలు మంజూరు.
3. గంటికోర్లం రోడ్డుకు 67 లక్షలు రూపాయలు మంజూరు.
4. చోడవరం నుండి అంకుపాలెం మీదుగా పి. ఎస్ పేట రోడ్డుకు 62 లక్షలు రూపాయలు మంజూరు.
5. చోడవరం నుండి లక్ష్మీపురం మీదుగా దామునాపల్లి రోడ్డు కు 52 లక్షల రూపాయలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.