వేరుశనగ విత్తనాలు కావాల్సిన రైతులు సంబంధిత రైతుభరోసా కేంద్రాల్లో శనివారం నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి మహబూబాష తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 కిలోల వేరుశనగ బస్తా పూర్తి ధర 2574 రూపాయలు వుండగా సబ్సిడీ 1029. 60 రూపాయలు పోగా రైతు 1544. 40 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఎకరాలోపు రైతులకు 2 బస్తాలు, ఎకరాపైన వున్న రైతులకు 3 బస్తాలు అందచేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ల కొరకు సంబంధిత రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. యూరియా, డిఎపి ఎరువులు కూడా రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా వున్నాయన్నారు. కావాల్సిన రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏమైనా సమస్య వుంటే వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో గాని, మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలని ఆయన తెలియచేశారు.