వేసవిలో మండే ఎండల్లో కాసేపు తిరిగినా, చాలా అలసిపోతాం. ఎన్ని శీతల పానీయాలు తాగినా దాహం తీరదు. ఇలాంటప్పుడు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. దప్పిక తీర్చటంతో పాటు శరీరంలోని నీటిశాతాన్ని కాపాడే ఈ పండ్లను తినటం వల్ల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు కూడా అందుతాయి. అవేంటో చూద్దామా ..
టమాటో - ఇందులో 94 శాతం నీరు ఉంటుంది.
ఆరెంజ్ - ఇందులో 87 శాతం నీరు ఉంటుంది.
పుచ్చకాయ - ఇందులో 92 శాతం నీరు ఉంటుంది.
స్ట్రా బెర్రీ - ఇందులో 92 శాతం నీరు ఉంటుంది.
కర్బుజా - ఇందులో 90శాతం నీరు ఉంటుంది.
రాస్బెర్రీ - ఇందులో 87శాతం నీరు ఉంటుంది.