కేంద్ర నిర్ణయం నేపథ్యంలో బీజేపీయేతర ప్రభుత్వాలపై కమలం నేతలు పెట్రోల్ పై ట్యాక్స్ తగ్గించాలని ఎదురుదాడి ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ జోడిదారైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఏపీలోని వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇంధనం, గ్యాస్ సిలిండర్‌పై ధరలు తగ్గిండచడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుంది అన్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని రిక్వెస్ట్ చేశారు.. అలాగే వర్షాకాలం కంటే ముందుగానే రాష్ట్రంలో రోడ్లను కూడా మరమ్మత్తులు చేయించాలన్నారు. ఈ మేరకు జనసేన అధినేత ట్వీట్ చేశారు.. ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
‘రోజు రోజుకీ పెరుగుతున్న ధరల దాడికి టెంటేలెత్తిపోతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నాను. పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంలోని అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనసారా ఆహ్వానిస్తున్నాను. ఫలితంగా పెట్రోలు రూ.9.50 పైసలు, డీజిల్ రూ.7వరకు తగ్గడం హర్షణీయం. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇందన రేట్లే కారణమన్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసర వస్తువుల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉండడం అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలకు కొంత స్వాంతన కలిగిస్తుందని భావిస్తున్నాను’అన్నారు పవన్.
‘పీఎమ్ ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గించడం పేదవారికి ఆర్ధికంగా మేలు చేకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వ బాటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని కోరుతున్నాను. ఇంధన ధరలపై స్థానిక పన్నులు అన్ని రాష్ట్రాలలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే అధికంగా ఉన్నాయి. అసలే అస్తవ్యస్థమైపోయి ధ్వంసమైన రోడ్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణం భారంగా మారి వాహనాలు మరమ్మతులకులోనై అల్లాడిపోతున్నారు. పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై రోడ్డు సెస్ పేరుతో ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వసూలు చేస్తోంది. అయినా రోడ్లను బాగు చేసే పరిస్టితి ప్రస్తుతం ఎలాగూ కనిపించడం లేదు. కనీసం పెట్రోలు, డీజిల్ పై స్థానిక పన్నులను తగ్గించి ఊరట కలిగించాలని ప్రజలు చేస్తున్న డిమాండును వైసీపీ సర్కారు నెరవేర్చాలని కోరుతున్నాను’అన్నారు.