ప్రభావవంతమైన సమూహంలోని సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించడం మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పరిణామాలను చర్చించడం లక్ష్యంగా క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం జపాన్‌కు రెండు రోజుల పర్యటన కోసం బయలుదేరారు.నాలుగు సభ్య దేశాల నేతలకు క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు ఈ సదస్సు అవకాశం కల్పిస్తుందని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు.మోదీతో పాటు మే 24న టోక్యోలో జరిగే సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన ఆంథోనీ అల్బనీస్ హాజరవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa