ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో పదికేసులు పెట్టుకోండి: నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 03:05 PM

ఇప్పటి వరకు తనపై 14 కేసులు పెట్టి ఏం పీకారని ప్రశ్నించారు. కావాలంటే మరో 10 కేసులు పెట్టుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ  జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. ‘‘జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు’’ అంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నో రూ. కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డానంటూ తనపై అసత్య ఆరోపణలు చేసి, ఏమీ పీకలేక కోవిడ్ నిబంధనల ఉల్లంఘనల కేసులో కోర్టుకు తీసుకొచ్చారని మండిపడ్డారు. నారా లోకేష్ సోమవారం విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు. 2020లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు.


అయితే, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్‌పై పోలీసులు నమోదు చేశారు. దీంతో కేసు విచారణలో భాగంగా లోకేష్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా వచ్చారు. అయితే, లోకేష్ కోర్టుకు హాజరు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రహదారులను దిగ్బంధించి టీడీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తనపై 14 కేసులు పెట్టి ఏం పీకారని ప్రశ్నించారు. కావాలంటే మరో 10 కేసులు పెట్టుకోవాలని సవాల్ విసిరారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే కోర్టుకు వచ్చానని, సీఎం జగన్ మాదిరిగా వాయిదాలు తీసుకోవట్లేదని వ్యాఖ్యానించారు. 2016 నుంచి తపపై చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమని.. తన అవినీతి కేసులపై చర్చకు సీఎం జగన్ సిద్ధమా అని లోకేష్ సవాల్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com