ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ-బైక్​ కారణంగా మరో ప్రాణం బలి

national |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 03:13 PM

ఎలక్ట్రిక్​ బైక్​ కు ఛార్జింగ్​ పెడుతుండగా కరెంట్ షాక్ తగలడంతో ఓ 23 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ మండలం మోప్రోలో ఆదివారం జరిగింది. మృతురాలి పేరు శివానీ అనిల్ పాటిల్. ఆమె కుటుంబ సభ్యులు కొంతకాలం క్రితం ఈ-బైక్ ను కొనుగోలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం శివానీ ఆ బైక్ కు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో ఆమె విలవిల్లాడుతూ కుప్పకూలింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై కరాడ్ గ్రామీణ పోలీస్​ స్టేషన్​ లో కేసు నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com