శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి గ్రామంలో వజీర్ (32)అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల మేరకు వజీర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో పైకప్పుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.