ముంబైలో ఓ స్కూటర్ పై ఏకంగా ఆరుగురు ప్రయాణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంధేరీ వెస్ట్ లోని స్టార్ బజార్ సమీపంలో ఆరుగురు ఒకే హోండా యాక్టివాపై వెళ్తూ కనిపించారు. నల్ల కుర్తా ధరించిన ఓ బాలుడు వెనుకనున్న బాలుడి భుజాలపై కూర్చున్నాడు. వెనుక కారులో ప్రయాణిస్తున్న రమణదీప్‌సింగ్ హోరా అనే వ్యక్తి వారిని వీడియో తీసి ముంబై ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. బైక్ పై ఇలా ప్రయాణాలు చేసే వారిని వదిలిపెట్టకూడదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
![]() |
![]() |