ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు జగన్నాథగట్టుపై హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 11:33 AM

కర్నూలు నగర శివార్లలోని జగన్నాథగట్టుపై వెలసిన ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద బుధవారం హనుమాన్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జగన్నాథగట్టు అభివృద్ది సమితి ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ. హనుమాన్‌ జయంతి సందర్భంగా స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం, అర్చన, హనుమాన్‌ చాలీసా పారాయణం, తదితర కార్యక్రమాలు జరగనున్నట్లు వివరించారు. ఈ వేడుకకు భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa