ఇండియాలో ప్రస్తుతం దాదాపు 8 కోట్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధి మరింత అధికంగా ఉంది. ఈ వ్యాధిని కొన్ని రకాల విధివిధానాలు పాటించడం ద్వారా సమర్థంగా ఎదుర్కోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజమే డయాబెటిస్. ఈ సమస్య కారణంగా అతి మూత్రం, అధిక దాహం, అతిగా ఆకలి వేయడం, చూపు మందగించడం, కారణం లేకుండానే బరువు తగ్గడం, బద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రీ-డయాబెటీస్ దశలో రోగి డాక్టర్ ని సంప్రదిస్తే వ్యాధి దరిచేరకుండా నివారించవచ్చు. అయితే, వ్యాధి లక్షణాలు 50 శాతం రోగుల్లోనే కనిపిస్తాయి. మిగిలిన వారిలో కేవలం వైద్య పరీక్షల ద్వారానే గుర్తించవచ్చు. ప్రీ-డయాబెటీస్ దశలో గుర్తించేందుకు 6 నెలలకు ఒక్కసారైన ప్రీ-డయాబెటీస్ టెస్టులు చేయించుకోవాలి. రక్తంలో చక్కెర పెరిగి చిక్కగా మారి మూత్రపిండాలు, కాళ్లు, నరాలు, గుండెకు సంబంధించిన రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం తలెత్తే అవకాశాలుంటాయి.
- ఈ వ్యాధి రోగుల పాదాల్లో రక్తప్రసరణ క్షీణించి నరాల స్పర్శ తగ్గడం వల్ల గాయాలు ఏర్పడుతాయి. అవి మానకపోవడం వల్ల పాదాలకు సమస్యలు ఏర్పడుతాయి. గోరువెచ్చటి నీరు సబ్బుతో నిత్యం పాదాలను శుభ్రం చేసుకోవాలి.
- ఈ వ్యాధితో బాధపడుతున్న వారు నాన్ వెజ్ తినడం పూర్తిగా మానేయడం చాలా మంచిది. అధిక కార్బోహైడ్రేట్లను ఇచ్చే కూరగాయలను తినాలి. బీన్స్, చిక్కుళ్ళు , తియ్యటి బంగాళాదుంపలు, క్వినోవా వంటి తృణధాన్యాలు ఆహరంలో భాగం చేసుకోవాలి. అరటిపూవు, అరటికాడ, క్యాబేజీ, లేత వంకాయ, బెండ, పొట్ల, దొండ, బీర, చిక్కుడు, మునగాకులను ఆహారంలోకి తీసుకోవచ్చు. ఆకుకూరల్లో పొన్నగంటికూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర వంటివి తినొచ్చు. బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు కూడా తినాలి. క్యారెట్, బీట్ రూట్ నెలకు కనీసం 2 సార్లు తినాలి. ఒమేగా 3 అధికంగా ఉండే సాల్మన్ చేపలను నెలకు ఒకసారైనా తినాలి. నిత్యం భోజనం చేసిన తర్వాత కనీసం 15 నిమిషాలు నడక అలవాటుచేసుకోవాలి. డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవడానికి వెజ్ తినడమే బెస్ట్ అని అమెరికా డయాబెటీస్ అసోసియేషన్ తేల్చింది.