ప్రత్యేక సామర్థ్యం ఉన్న ఓ తండ్రి తన పిల్లలను ట్రైసైకిల్‌పై స్కూల్‌కి దింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయెల్ ట్విట్టర్లో షేర్ చేశారు. దివ్యాంగుడైన ఆ వ్యక్తి తన పిల్లలను దింపడానికి తన ట్రైసైకిల్‌ను తొక్కడం వీడియోలో ఉంది. తన పిల్లలపై ఆ తండ్రికి ఉన్న ఎనలేని ప్రేమ కనపడుతోంది. ఈ వీడియోను సోమవారం షేర్ చేయగా, కొద్ది సేపటిలోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో ఇంటర్నెట్ యూజర్లను హత్తుకుంది. కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు తమ జీవితాలను దిద్దిన తండ్రుల పట్ల తమ కృతజ్ఞత, ప్రేమను వ్యక్తీకరిస్తూ కామెంట్లు పెడుతున్నారు.