భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసులలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గత 24 గంటల్లో 2,124 కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి 17 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశం మొత్తం 1,977 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ రేటు దాదాపు 98.75 శాతంగా ఉంది. భారతదేశంలో మొత్తం కోవిడ్-19 యాక్టివ్ కేసులు సంఖ్య 14,971కి చేరింది. నిన్న యాక్టివ్ కేసుల సంఖ్య 14,841గా ఉంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య 130 పెరిగింది.
రోజువారీ సానుకూలత రేటు 0.46%గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 5,24,507కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు అర్హులైన వారికి 1,92,67,44,769ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను అందజేశారు. గడిచిన 24 గంటల్లో 13,27,544 మందికి వ్యాక్సిన్ అందించారు.