అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పేరూరులో వివాహిత ఆదిలక్ష్మి (26) ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటి పై కప్పు కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలానికి చెందిన ఆమెకు ఆరేళ్ల క్రితం పేరూరు వడ్డే అంజితో వివాహం జరిగింది. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఎస్ఐ జనార్ధన్ నాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.