మిమ్మల్నీ పోలీసులు చూడటంలేదు. ట్రాఫిక్ కెమెరాలు లేవని రహదార్లపై నిబంధనలు అతిక్రమించారా జాగ్రత్త. మీకు తెలియకుండానే సామాన్యుడి చేతిలోని ఫోన్లు క్లిక్ అవుతాయని, అవి కాస్త పోలీసులకు చేరితే జరిమానా తప్పదని గ్రహించండి. తాజాగా ఘటన ఇలాంటిదే మరి.
ముంబై పోలీసులు కూడా తాజాగా రూల్స్ అతిక్రమించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఐతే అన్నిసార్లూ పోలీసులు సరిగానే వ్యవహరిస్తున్నారా అన్నది హాట్ డిబేట్ అయ్యింది. ట్విట్టర్ యూజర్ ముంబై మాటర్జ్.. ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి రోడ్డుపై స్కూటీలో తన కూతుర్ని కూర్చోబెట్టుకొని... తను కూడా స్కూటీపై కూర్చొని సెల్ఫీ తీసుకున్నాడు. సమస్య ఏంటంటే... ఆ వ్యక్తి... హెల్మెట్ పెట్టుకోలేదనీ... ఇతర వాహనాలకు దారి ఇవ్వలేదనీ ఆ ట్విట్టర్ యూజర్.. ముంబై పోలీసులకు ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు.
ఓ నెటిజన్ ట్వీట్ చేసిన ముంబై మాటర్జ్... ఆ స్కూటీపై వ్యక్తి... చట్టాన్ని అతిక్రమించడమే కాకుండా.. "పోలీసుల్ని పిలుచుకోండి... ఏం చేసుకుంటారో చేసుకోండి" అని నవ్వుతూ అన్నాడనీ... ఈ రోజుల్లో పోలీసులంటే గౌరవం లేకుండా పోయిందని ట్వీట్ చేశారు.
దీనిపై ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. "అతను పిలిచాడు కాబట్టి వెళ్లాల్సి ఉంది. నేరం ఉంది, చట్టమూ ఉంది. అతన్ని త్వరలోనే మా ఛలాన్ చేరుతుంది" అని మే 19, 2022న రిప్లై ఇచ్చారు.