ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళి తరువాత ఛార్జీల మోత...రీఛార్జ్ ధర పెంచనున్న ప్రధాన టెలికాం సంస్థలు

business |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 03:37 PM

చౌక ధరలతో అలవాటు చేసి ఇక వ్యసనంగా మారకా ఛార్జీల పెంచేందుకు ప్రధాన  టెలికాం కంపెనీలన్నీ సిద్దమవుతున్నాయి. ఈ ఛార్జీల మోత వచ్చే దీపావళి నుంచి ప్రారంభంకానున్నట్లు  సమాచారం. ప్రైవేట్ టెలికం సంస్థలు ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా ఈ సంవత్సరం మరోసారి చార్జీలు పెంచుతాయని కొంతకాలంగా సంకేతాలు వస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ ఈ విషయాన్ని చెప్పగా.. జియో, వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాట పట్టే అవకాశాలు అధికం. అయితే ఎంత ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు ఎంత వరకు పెరగవచ్చు.. ఎప్పటి కల్లా ఇవి అమలులోకి వచ్చే అవకాశం ఉందన్న విషయాలు తాజాగా బయటికి వచ్చాయి. అలాగే ఈ సంవత్సరం ఎక్కువ లాభపడే సంస్థలు ఏవో కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ప్రైవేట్ టెలికం సంస్థలు ఈ సంవత్సరం దీపావళి పండుగలోగానే ప్రీపెయిడ్ ధరలు పెంచనున్నాయని అమెరికా ఈక్విటీ రీసెర్చ్ సంస్థ విలియమ్ ఓ నీల్ అండ్ కో అంచనా వేసింది. మరో 10 నుంచి 12 శాతం వరకు ధరలు పెరుగుతాయని రిపోర్ట్‌లో వెల్లడించించింది. దీని ద్వారా కంపెనీల యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ బాగా పెరుగుతుందని చెప్పింది. ఒకవేళ ప్రీపెయిడ్ చార్జీల ధరలు 10 శాతం పెరిగితే.. ఉదాహణరకు సుమారు రూ.500 ఉండే ప్లాన్‌ ధర రూ.550కు చేరుతుంది.


ఈ సంవత్సరం ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియో సంస్థలు ఎక్కువగా లాభపడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సంస్థలకు దేశవ్యాప్తంగా బలమైన 4జీ నెట్‌వర్క్ ఉంది. దీంతో కొత్త కస్టమర్లు యాడ్ అవుతారని అంచనా. మరోవైపు నిధులను సమకూర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్న వొడాఫోన్ ఐడియాలో కొత్త యూజర్ల రాక కాస్త నెమ్మదిగానే ఉంటుందని పేర్కొంటున్నారు.


ఈసారి ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్‌ను పెంచాక ఎయిర్‌టెల్‌ ఏపీ ఆర్ యూ  తక్కువ సమయంలోనే రూ.200 చేరుతుందని అంచనా. ఆ సంస్థ కూడా తమ స్వల్ప కాలిక లక్ష్యం ఇదేనంటూ.. చార్జీల పెంపుపై బలమైన సంకేతాలు ఇచ్చింది. కాగా సుదీర్ఘ కాలంలో రూ.300 ఏఆర్ పియూ  లక్ష్యమని వెల్లడించింది. అయితే దీన్ని సాధించిందేకు మరో రెండేళ్లు పట్టొచ్చు.


ఎయిర్‌టెల్‌ బాటలోనే వొడాఫోన్ ఐడియా కూడా ప్రీపెయిడ్ ధరలను పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే టారిఫ్ ధరలను అధికం చేసినా.. వొడాఫోన్ ఐడియా ఏపీ ఆర్ యూ రూ.150కు చేరడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. ఇదే ఈ సంస్థకు ఇబ్బందికరంగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇతర సంస్థలతో పోలిస్తే వొడాాఫోన్ ఐడియాకు ఎక్కువ మంది 2జీ కస్టమర్స్ ఉన్నారు. అందుకే ఏపీ ఆర్ యూ  పెరగడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com