ప్రపంచ కుబేరులలో ఒక్కడైనా ఎలన్ మస్క్ సంపద రోజురోజుకు కరిగిపోతోందటా. దీనికి పలు కారణాలున్నాయన్న వార్తలు ప్రచారంలోవున్నాయి. ప్రధానంగా ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల కారణం ఒకటైతే . ఆ కారణంతోనే ఆయన సంపదంతా కరిగిపోతోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆయన కొనుగోలు చేసే వివిధ సంస్థల డీల్ పై ఈ అంశం తీవ్ర ప్రభావం చూపనున్నది.
టెస్లా వ్యవస్థాపకుడు, సీఈవో ఎలన్ మస్క్ ఒక్క రోజే భారీగా 10 బిలియన్ డాలర్లను(రూ.77,595 కోట్లను) పోగొట్టుకున్నారు. దీనికంతటికీ కారణం ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణలే. ఈ వార్త విడుదలైన ఒక్క రోజుల్లో.. ఈ ప్రపంచ కుబేరుడి నికర సంపద బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ప్రకారం 212 బిలియన్ డాలర్ల నుంచి 201 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఓ కార్పొరేట్ జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో ఎలన్ మస్క్ అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇటీవలే ఓ ఇంగ్లీష్ మీడియా నివేదించింది. ఈ లైంగిక వేధింపులపై ఎయిర్‌హోస్టెస్ న్యాయపోరాటానికి కూడా సిద్ధమైందని, కానీ స్పేస్‌ఎక్స్ కంపెనీ ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు 2018లో ఆమెకి 2,50,000 డాలర్లను చెల్లించినట్టు ఈ నివేదిక పేర్కొంది. కానీ ఈ ఆరోపణలన్నింటిన్ని ఎలన్ మస్క్ కొట్టిపారేశారు. ఇదంతా రాజకీయ దురుద్దేశ్యంతో తనపై ఈ నీచ రాజకీయాలకు దిగుతున్నారంటూ ప్రతి ఆరోపణలు చేశారు. ఈ వార్తల సమయంలోనే మరోవైపు నుంచి ఎలన్ మస్క్ సంపద మంచుకొండలా కరిగిపోయింది.
మార్కెట్లలో టెస్లా స్టాక్ ధరలు భారీగా పడిపోయాయి. టెస్లా కంపెనీలో ఎలన్ మస్క్‌కి 15 శాతం వాటాలున్నాయి. ఈ లైంగిక ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత, టెస్లా షేరు ధర 6.4 శాతం నష్టపోయింది. ఈ సంఘటనను పక్కన పెడితే.. అప్పటి నుంచి ఎలన్ మస్క్ సంపద ఇప్పటి వరకు 69 బిలియన్ డాలర్లకు పైగా తగ్గిపోయినట్టు బ్లూమ్‌బర్గ్ అంచనావేసింది. గ్లోబల్‌గా స్టాక్ మార్కెట్లు కుదేలవడం కూడా టెస్లా షేర్లు పడిపోవడానికి కారణంగా నిలుస్తున్నాయి.
గత నెలలోనే ఎలన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ డీల్‌ను తాత్కాలికంగా ఆపివేశారు. స్పామ్, ఫేక్ అకౌంట్ల కారణంతో డీల్‌ను నిలిపివేసినట్టు ఈ టెస్లా సీఈవో చెప్పారు.