ఈపీఎఫ్ఓ కలిగిన ప్రతి ఒక్క ఉద్యోగికి యూఏఎన్ సంఖ్య గుర్తించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే అదే చాలా ముఖ్యం కాబట్టి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)కు కంట్రిబ్యూట్ చేసే ప్రతి ఒక్కరికీ 12 అంకెల యూనిక్ నెంబర్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్) ఉంటుంది. ఈ నెంబర్‌ను ఈపీఎఫ్ఓజారీ చేస్తుంది. పలు సంస్థలు, కంపెనీలు జారీ చేసే ఇండివిడ్యువల్ మెంబర్ ఐడీలకు యూఏఎన్ సెంట్రల్ రిపాజిటరీ లాగా పనిచేస్తుంది. ఉద్యోగి కెరీర్ అంతా ఈ యూఏఎన్ ఒకటే ఉంటుంది. ఉద్యోగి ఎన్ని కంపెనీలు లేదా ఎన్ని పొజిషన్లు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మారదు. కానీ ఒకవేళ ఉద్యోగి యూఏఎన్ నెంబర్ మర్చిపోతే ఎలా..? దాన్ని ఎలా రికవరీ చేసుకోవచ్చు..? వంటి విషయాలపై యూఏఎన్ ట్విటర్ వేదికగా అవగాహన కల్పిస్తుంది.
యూఏఎన్ తెలుసుకోవడమెలా..?
స్టెప్ 1.. తొలుత అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/కి వెళ్లాలి.
స్టెప్ 2.. Know Your UAN statusపై క్లిక్ చేయాలి.
స్టెప్ 3.. డ్రాప్‌డౌన్ మెనూలో ఉన్న మీ రాష్ట్రాన్ని, ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని ఎంచుకోవాలి.
స్టెప్ 4.. పీఎఫ్ నెంబర్ నమోదు చేసి, మీ వ్యక్తిగత వివరాలు పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి వాటిని ఎంటర్ చేయాలి.
నోట్ : పీఎఫ్ నెంబర్ లేదా మెంబర్ ఐడీ అనేది మీ శాలరీ స్లిప్‌పై ఉంటుంది.
స్టెప్ 5.. క్యాప్చాను నమోదు చేసి, ‘Get Authorisation Pin’పై క్లిక్ చేయాలి.
స్టెప్ 6.. మీ మొబైల్ నెంబర్‌కి పిన్ వస్తుంది.
స్టెప్ 7.. పిన్‌ను నమోదు చేసిన తర్వాత వాలిడేట్ ఓటీపీ, గెట్ యూఏఎన్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 8.. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్‌కి ఈ యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ను పంపిస్తుంది ఈపీఎఫ్ఓ.
మీ పీఎఫ్ అకౌంట్‌లో డెబిట్లు ఏమిటి..? క్రెడిట్స్ ఏమిటి..? అనేది తెలుసుకోవడం కోసం యూఏఎన్ ఎంతో అవసరం. యూఏఎన్ ద్వారానే ఉద్యోగులు తమ మనీని విత్ డ్రా చేసుకోవచ్చు, ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ నెంబర్‌తోనే ఉద్యోగులు తమ అకౌంట్లలో నెలవారీ డిపాజిట్లు పడ్డాయో లేదో కూడా చూసుకోవచ్చు. అయితే యూఏఎన్ నెంబర్‌ను ఉద్యోగులు ఆధార్ నెంబర్‌తో లింక్ చేసుకోవాల్సినవసరం ఉంది.