అరటి పండంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే లేదు అని యూరోపియన్లు తెలిపారు. కానీ నిజానికి ఈ మాట అరటిపండుకు చక్కగా వర్తిస్తుంది. అరటిపండును పూర్తిస్థాయి ఆహారంగా చెప్పవచ్చు. అరటిపండు నుంచి కొంచెం కొలెస్ట్రాల్ కూడా శరీరంలోకి చేరకపోవడం విశేషం. ఒక యాపిల్ కన్నా నాలుగు రెట్లు ప్రొటీన్లు, రెండు రేట్లు పిండిపదార్ధాలు, మూడింతల ఫార్ఫరస్, ఐదింతల విటమిన్ ఎ, ఐరన్, రెండింతల ఇతర విటమిన్లు, ఖనిజాలు అరటిపండులో ఎక్కువగా లభిస్తాయి. అంతటి అద్భుతమైన అమృతఫలాన్ని నెలరోజుల పాటు రోజుకు రెండు పూటలా తింటే ఏమవుతుందో తెలుసుకుందాం.
--- ధూమపానం వల్ల శరీరంలో పేరుకుపోయిన నికోటిన్ ను అరటిపండు పూర్తిగా తొలగిస్తుంది.
--- అరటిపండ్లలో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. దీంతో రక్తహీనత కు అరటిపండు చక్కని పరిష్కారం.
--- జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకాన్ని దూరం చేస్తుంది.
--- బాగా పండిన అరటిపండును చిన్నపిల్లలకు తినిపిస్తే, వారిని విరోచనాల బారినుండి తప్పించవచ్చు.
--- ఇందులో ఉండే సుక్రోజ్, ఫ్రూక్టోజ్, గ్లూకోజ్ వల్ల తిన్నవెంటనే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.