కావలసిన పదార్థాలు: నిమ్మకాయ - 1, సోడా, పుదీనా ఆకులు - కొన్ని, బ్లాక్ సాల్ట్ - కొద్దిగా, పంచదార - 4స్పూన్లు, ఐస్ క్యూబ్స్ .
తయారీవిధానం: నిమ్మకాయను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక గ్లాసులో నిమ్మకాయ ముక్కలను, నాలుగైదు పుదీనా ఆకులను వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పుదీనా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా దంచుకున్న తర్వాత, అందులో నాలుగు స్పూన్ల పంచదార, టేస్ట్ బ్యాలన్స్ చెయ్యటానికి చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. కొన్ని ఐస్ క్యూబ్స్ ఆ గ్లాసులో వేసి గ్లాసు నిండేంత వరకు సోడాను పోసుకోవాలి. ఆ తర్వాత స్ట్రా తో బాగా కలిపి తాగితే వెరైటీ వర్జిన్ మొజిటో రెడీ. దీనికి రెస్టారెంట్ స్టైల్ లుక్ రావాలంటే, గ్లాసుకు సన్నగా కోసిన ఒక నిమ్మచెక్కను, కొద్దిగా పుదీనా ఆకులను జత చేసి, ఒక స్ట్రా వవేస్తే సరి..., రెస్టారెంట్ స్టైల్ వర్జిన్ మొజిటో రెడీ.