సామాజిక న్యాయభేరి కార్యక్రమంలో భాగంగా ధర్మాన కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... నాడు బాబా సాహెబ్ అంబేడ్కర్ ఒక మాట చెప్పారు. నేను బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బండి మొదలుపెట్టాను. దీన్ని ముందుకు తీసుకుపొండి. కానీ వెనక్కు మాత్రం పోకుండా చూడండి అన్నారు. అయితే ఇన్నేళ్ల తర్వాత రాష్ట్రంలో ఆ బండిని సీఎం శ్రీ వైయస్ జగన్‌గారు ఎంతో ముందుకు తీసుకెళ్లారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఆయన చిత్తశుద్థితో పని చేస్తున్నారు. ఆ విధంగా సామాజిక న్యాయం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే సామాజిక ఉద్యమం అనేది ఈనాటిది కాదు. బ్రిటిష్ పాలన కంటే ముందు, వారి పాలనలోనూ, ఆ తర్వాత కూడా ఉంది. తమకు పాలనలో సమానమైన వాటా లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు భావిస్తున్నారు. సీఎం శ్రీ వైయస్ జగన్‌గారు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. 25 మంది మంత్రుల్లో 17 మంది ఆ వర్గాల వారు కాగా, అది ఏకంగా 70 శాతం. ఈ స్థాయిలో గతంలో ఏనాడూ జరగలేదు. దీంతోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం ఆగిపోలేదు. వివిధ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా దాదాపు రూ.1.30 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాగా, అందులో ఈ వర్గాల వారు దాదాపు 82 శాతం ఉన్నారు.ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేదు. దళారుల ప్రమేయం లేదు. అర్హతే ప్రధాన అర్హతగా, కులం, మతం, వర్గం, రాజకీయం అన్న భేదం చూడకుండా పథకాలు అమలవుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం అని తెలియజేసారు.