మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అయితే మధుమేహంతో బాధపడే వారు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో కార్పొహైడ్రేట్లు అధికంగా ఉంటే క్లోమ గ్రంథి దెబ్బతిని ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. మైదాతో చేసిన పదార్థాలు, బంగాళాదుంపలు, కూల్ డ్రింకులు, స్వీట్లు, డ్రై ఫ్రూట్లు, జామ్‌లను మధుమేహ బాధితులు దూరం పెట్టాలి.