తెలుగు రాష్ట్రాల లోని మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణమైన మహిమాన్విత శ్రీ జేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం నందు జూన్ 9 వ తారీకు నాడు వైభవోపేతంగా నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. విగ్రహ ప్రతిష్ట లో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిమిత్తం మొత్తం నాలుగు ధ్వజ స్తంభాలను అంగరంగ వైభవంగా దేవస్థానం లాంఛనాలతో వినుకొండ పట్టణ పురవీధులలో నగర ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఊరేగింపు నందు 2 కీర్తి ధ్వజములు( రాతి ధ్వజములు) 2 జీవ ధ్వజస్తంభాలు (కర్ర చెక్క ధ్వజములు) అని మొట్టమొదటిసారిగా 4 ధ్వజ స్తంభాలను ప్రతిష్టగావించడం వినుకొండ పట్టణంలో మునుపెన్నడూ లేని అత్యంత అరుదైన విషయమని తెలియజేశారు. జూన్ 9 వ తారీఖు నాడు ఉదయం 7. 38 నిమిషాలకు నాలుగు స్తంభాలు ఒకే సమయంలో ప్రాణ ప్రతిష్ట గావించుటకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa