పోలవరం మండలం కొత్తూరు చెరువు కింద ఎకరం వరి కుప్ప శనివారం ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. వివరాల్లోకి వెళితే పోలవరం మండలం ఎడ్ల గూడెం గ్రామానికి చెందిన సరిపల్లి ఆనంద్ ఎకరం పొలం ను ఎడ్ల గూడెం గ్రామానికి చెందిన తోర్లపాటి రాజు కౌలురైతు ఆ ఎకరం పొలంలో వరి పండించి కోత కోసి కుప్ప వేశారు. ఆ వరి కుప్పను ఊడ్చి ధాన్యం ఇంటికి తెచ్చుకుందామని శనివారం సాయంత్రం పొలం కి వెళ్ళిన తోర్లపాటి రాజు అగ్నిలో ఆహుతి అవుతున్న వరి కుప్పను చూసి కుప్పకూలాడు. అప్పులు తెచ్చి కష్టపడి ఆరుగాలం పండించిన పంట కళ్లముందే కాలిపోతుంటే ఆ రైతు కన్నీరుమున్నీరయ్యారు. అసలే పేద కుటుంబం అప్పులు తెచ్చి మరీ వ్యవసాయం చేశానని అధికారులు పరిశీలించి పంట నష్టం అంచనా వేసీ నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని , సంబంధిత అధికారులను ఆ రైతు వేడుకుంటున్నారు.