ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీతాలు ఇవ్వకుంటే చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 29, 2022, 08:29 PM

శ్రీకాళహస్తీశ్వరాలయంలో భద్రతా ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదు. భద్రతా సిబ్బంది టెండర్ దక్కించుకున్న గుత్తేదారులు ఆలయం తరఫున తీసుకోవాల్సిన నగదు తీసుకున్నా సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు చెల్లించకపోవడం పై పలువురు ఉద్యోగులు చైర్మెన్ అంజూరు తారక శ్రీనివాసులు కుమారి పెట్టుకున్నారు.


ఈ సందర్భంగా చైర్మన్ సంబంధిత గుత్తేదారుల తో ఫోన్లో చర్చించారు. జిఎస్టి చెల్లింపు చేయాల్సి వస్తుందన్న కారణంగా జీతాలు చెల్లించకపోవడం సరికాదన్నారు. వారం రోజుల లోపు ఆరు నెలల జీతాలు చెల్లించాలని లేకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ తరహా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa