ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలలోగా పొత్తులపై క్లారిటీ ఇస్తానని చెప్పారు. అధికార పార్టీ బీసీ మంత్రులే మూగ జీవాలు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు సీఎం జగన్ పంచారని విమర్శించారు.