సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం రిలీజ్ చేసింది. సివిల్ సర్వీసెస్ కోసం మొత్తం 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్‌లో శృతి శర్మ మొదటి ర్యాంక్, అంకితా అగర్వాల్ రెండవ ర్యాంక్, గామిని సింగ్మా తృతీయ ర్యాంక్ సాధించారు.
సివిల్స్-2021లో తెలుగువారి విషయానికి వస్తే యశ్వంత్ కుమార్ రెడ్డి 15వ ర్యాంకు సాధించాడు. పూసపాటి సాహితీ.. 24వ ర్యాంక్, కొప్పిశెట్టి కిరణ్మయి.. 56వ ర్యాంక్, శ్రీపూజ.. 62వ ర్యాంక్, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి.. 69వ ర్యాంక్, ఆకునూరి నరేష్.. 117వ ర్యాంక్, అరుగులు స్నేహ .. 136వ ర్యాంక్, బి చైతన్య రెడ్డి.. 161వ రెడ్డి, ఎస్ కమలేశ్వర్ రావు.. 297వ ర్యాంకు, విద్యామరి శ్రీధర్.. 336వ ర్యాంకు, దిబ్బడ ఎస్వీ అశోక్.. 350వ ర్యాంకు, గుగులావత్ శరత్ నాయక్.. 374వ ర్యాంక్, నల్లమోతు బాలకృష్ణ.. 420వ ర్యాంకు, ఉప్పులూరి చైతన్య.. 470వ ర్యాంకు, మన్యాల అనిరుధ్.. 564వ ర్యాంకు, రంజిత్‌కుమార్.. 574వ ర్యాంకు, పాండు విల్సన్.. 602వ ర్యాంకు, బాణావత్ అరవింద్.. 623వ ర్యాంకు, బచ్చు స్మరణ్ రాజ్.. 676వ ర్యాంకు సాధించారు.ఈసారి మొత్తం 685 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ కోటా నుంచి 244, ఈడబ్ల్యూఎస్ నుంచి 73, ఓబీసీ నుంచి 203, ఎస్సీ కేటగిరీ నుంచి 105, ఎస్టీ కేటగిరీ నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే.. ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు.