ఆడవాళ్ళకి, జుట్టుకి విడదీయరాని అనుబంధం ఉంది. నల్లని ఒత్తైన కురులను కోరుకొని యువతి ఉండదనే చెప్పాలి. జడ చిన్నగా ఉన్నదని బాధ పడేవారు, సాధారణ వేగం కన్నా రెండు రేట్లు వేగంతో జుట్టు పెరగాలంటే ఒక్క సారి ఇలా చెయ్యండి. క్రమంగా వచ్చే తేడా మీకే తెలుస్తుంది. ఇందుకోసం మీరు నాలుగు స్టెప్స్ క్రమం తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అవేంటో చూద్దామా
1. రెమెడీ - ఆరోగ్యకరమైన జుట్టు కోసం ముందుగా ఈ మిశ్రమాన్ని తలకు రాయాలి. ఒక రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను పేస్ట్ లా చెయ్యాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి తలకు రాసుకోవాలి.
2. పండ్ల రసం - ఉసిరికాయతో తయారుచేసిన జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగుతుండాలి.
3. పండు - రోజూ ఆరెంజ్ ను మర్చిపోకుండా తినాలి.
4. యోగా - తరచూ చైల్డ్ పోజును వెయ్యాలి. మోకాళ్ళ మీద కూర్చుని శరీర పై భాగాన్ని ముందుకు వంచాలి. ఈ క్రమంలో రెండు చేతులను తలకు ఇరుపక్కలా ఉంచాలి