కావలసిన పదార్థాలు - పుచ్చకాయ - 1, నిమ్మకాయ - 1, పుదీనా ఆకులు - కొన్ని, తేనె - రుచికి తగినంత, స్ట్రాబెర్రీ - 10, ఐస్ క్యూబ్స్ .
తయారీవిధానం - ముందుగా పుచ్చకాయను గింజలు లేకుండా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. స్ట్రాబెర్రీలను కూడా చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొక బ్లెండర్ తీసుకుని అందులో సమపాళ్లలో పుచ్చకాయ, స్ట్రాబెర్రీ ముక్కలను వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ జ్యూస్ ను వడకట్టాలి. వడ కట్టగా వచ్చిన జ్యూస్ ను ఒక గ్లాసులో తీసుకుని అందులో నిమ్మరసాన్ని, తేనెను కలపాలి, నాలుగైదు పుదీనా ఆకులను చేతితో బాగా నలిపి జ్యూస్ లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ ను వేసుకుని తాగితే చాలా టేస్టీ గా ఉంటుంది. లేకపోతే, జ్యూస్ ను కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టినా ఓకే. వేసవి వేడిమికి చక్కని పరిష్కారమైన పుచ్చకాయ లో తొంభై శాతానికి పైగానే నీరు ఉంటుంది. ఇక, స్ట్రాబెర్రీలలో ఎన్నో న్యూట్రిఎంట్స్ ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీర వేడిమి తగ్గుతుంది అలానే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.