సత్యసాయి జిల్లా కొత్తచెరువు పట్టణంలో శ్రీ చైతన్య నారాయణ, పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ అడ్మిషన్లు ఆపివేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు స్పందన కార్యక్రమంలో రాయలసీమ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మహేష్ వినతి పత్రం ద్వారా విన్నవించారు.
సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేసి విషయంపై మండల విద్యాశాఖ అధికారి తోపాటు, జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అయినప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడంతో స్పందనలో వినతి పత్రం ద్వారా విన్నవించడం జరిగిందన్నారు.
అత్యంత కరువు జిల్లా అయిన శ్రీసత్యసాయి జిల్లాలో వర్షాలు లేక ప్రజలు తీవ్ర కరువుతో అల్లాడుతున్న తరుణంలో శ్రీ చైతన్య, నారాయణ పాఠశాల యాజమాన్యం పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని, ప్రజల పై చైనా యాజమాన్యం చేస్తున్న అధిక ఫీజులకు వసూలు నిరసనగా త్వరలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న చైనా యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం జిల్లా ఉపాధ్యక్షుడు కురుగుంట గోవిందు, నరసింహ, కేశవయ్య, అశోక్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.