తమిళనాడు రాష్ట్రానికి చెందిన నరేష్ కార్తిక్, గాయత్రి దంపతులు తమ కూతురికి కులం, మతం లేకుండా ధ్రువపత్రం తీసుకుని ఆదర్శంగా నిలిచారు. కోయంబత్తూరు సాయిబాబా కాలనీ పరిధిలోని కేకే పుదూర్ కి చెందిన వీరు తమ కూతురు విల్మను (4) స్కూల్ లో చేర్చేటప్పుడు కులం, మతం లేదని ధ్రువపత్రం ఇవ్వాలనుకున్నారు. దరఖాస్తు చేసి అధికారుల నుంచి సర్టిఫికెట్ ను పొందారు. ఈ విషయం వైరల్ కావడంతో పలువురు వీరిని అభినందిస్తున్నారు.