తిరుమలలో జూన్ 1 నుంచి ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. దుకాణదారులు, హోటళ్లు, ప్లాస్టిక్ కవర్లు వాడితే సీజ్ చేస్తామని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు టీటీడీ మంగళవారం ప్రకటించింది. అలిపిరి టోల్ వద్ద తనిఖీలు చేపడతామని, ప్లాస్టిక్ రహిత వస్తువులనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. దుకాణదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.