ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖలో అవినీతి లేదని చెప్పలేమన్నారు. అవినీతిని అరికట్టడానికి విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవాలయాల్లో అర్చకులుగా బ్రాహ్మణేతరుల నియామకానికి చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పండితులు, అధికారులు దీనిపై ఓ నిర్ణయానికి రావాలన్నారు.