ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సిమ్లాలో ఓ బాలిక వేసిన తన తల్లి పెయింటింగ్‌ను స్వీకరించారు. సిమ్లాలోని రిడ్జ్ మైదాన్‌కు వెళ్లే రహదారి మొత్తం ప్రధాని మోడీని చూసేందుకు వచ్చిన ప్రజలతో నిండిపోయింది. గుమిగూడిన జనం మధ్య అను అనే అమ్మాయి ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ చిత్రపటాన్ని పట్టుకుని నిలబడి ఉంది. దీనిని చూసిన ప్రధాని కారు దిగి, ఆమె వద్దకు వెళ్లారు. బాలిక నుంచి ఆ చిత్రాన్ని ఎంతో అభిమానంతో స్వీకరించారు.