టీడీపీలో గ్రూపు రాజకీయాలను సహించేది లేదని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం పార్టీ మహిళా నేత దివ్యవాణి వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జగన్ పాలనతో వైసీపీ పనైపోయిందని, జరగబోయేది వన్ సైడ్ ఎలక్షన్స్ అని చెప్పారు. ఈ తరుణంలో పార్టీలో గ్రూపులు పెడితే కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.