వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివ ప్రకాష్ రెడ్డి, బీటెక్ రవి, పరమేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్ లను విచారించాల్సి ఉంది. తులసమ్మ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. విచారణను ఆగస్టు 30కి వాయిదా వేసింది.