శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి నెల మూడు విడతలుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 గ్రాముల బరువు ఉన్న కోడిగుడ్లకు బ్లూ, గ్రీన్, ఎల్లో రంగులతో ముద్ర వేసిన గుడ్లను ట్రాన్స్ పోతుదారుడు సరఫరా చేయాల్సి ఉంది.
అయితే ట్రాన్స్ పోట్ చేసే వ్యక్తి రవాణా డబ్బులు మిగులించుకోవాలన్న ఆశతో నెలలో మొదటి, రెండు, మూడు విడతల కోడిగుడ్లను ఒకేరసారి కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని జిల్లాలోని అంగణవాడి కేంద్రాల కార్యకర్తలు, సూపర్వై జర్లకు, జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ట్ట్రాన్స్ పోర్టర్ పై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల పలు విమర్శలకు దారి తీస్తోంది.
ఎవరైనా సూపర్వై జర్లు, అంగన్వాడి కార్యకర్తలు ట్ట్రాన్స్ పోట్ చేసే వ్యక్తిని ఒకటి లేదా రెండు దఫాలుగా మాత్రమే మీరు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారని ఆయనను ప్రశ్నిస్తే అంతా నా ఇష్టం ఎవరైనా సిబ్బంది నాకు అడ్డు చెబితే రాజకీయ పలుకుబడితో వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేయిస్తాన్ అంటూ భయ బ్రాంతులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఐసిడిఎస్ సిబ్బందే గుసగుసలా డుకోవడం చర్చనీయాంశంగా మారింది.
దీనితో ట్ట్రాన్స్ పోటీచేసే వెక్తి పై జిల్లా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటే ఏమి జరుగుతుం దో నన్ను భయముతో మిన్నకుండి పోతుండ డం విశేషం. జిల్లా వ్యాప్తంగా 7 డు సిడిపిఓ డివిజన్ల పరిధిలో 2824 అంగన్వాడీ కేంద్రాలలో గర్భవతులు 14, 910 మంది, బాలింతలు 14, 852 మంది, ఏడు నెలల నుండి 3 సంవ త్సరాల లోపు వయస్సు గల పిల్లలు 62, 330 మంది, 3 నుండి 6 సంవత్స రాల లోపు పిల్లలు 46, 081 మందికి ప్రతి నెల 33 లక్షల 85 వేల 922 కోడిగుడ్లను సదరు ట్రాన్స్ పోర్టర్ నెలలో మూడు దశలుగా సరఫరా చేయాల్సి ఉంది. అయితే ట్రాన్ పోటు చేసే వ్యక్తి జిల్లాలోని ఓ ప్రజాప్రతినిది అండతో రెండు విడతల్లో మాత్రమే గుడ్లను సప్లై చేస్తూ మూడు విడతలు కోడిగుడ్లను సప్లై చేసినట్లు ప్రతి నెల లక్షలాది రూపాయల బిల్లులను మంజూరు చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.