ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి ఎన్నిక ఇక లాంచనమే...నాలుగు సీట్లకు నాలుగు నామినేషన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 04:59 AM

వైసీపీ తరఫున రాజ్యసభ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల ఎంపిక ఇక లాంచనంగా మారింది. నాలుగు స్థానాలకు గానూ  నాలుగు నామినేషన్లు రావడం, వాటి పరిశీలన జరగడంతో ఇక ఆ అభ్యర్థుల ఎంపిక లాంచన ప్రాయంగా మారింది. రాజ్య‌స‌భ‌లో త్వర‌లో ఖాళీ కానున్న స్థానాల భ‌ర్తీ కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆయా స్థానాల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ వెలువ‌డ‌గా నామినేష‌న్ల గ‌డువు కూడా ముగిసిపోయింది. తాజాగా బుధ‌వారం సాయంత్రంతో నామినేష‌న్ల ప‌రిశీల‌న కూడా పూర్తి అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఏపీలోని నాలుగు స్థానాల ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల క‌మిష‌న్ కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న చేసింది.


ఏపీ కోటాలోని 4 రాజ్య‌స‌భ స్థానాల‌కు 4 నామినేష‌న్లే వ‌చ్చాయ‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో 4 నామినేష‌న్లు కూడా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ఉన్నాయ‌ని కూడా ప్ర‌క‌టించింది. నామినేష‌న్లు వేసిన వారిలో వైసీపీ అభ్యర్థులు వేణుంబాక విజ‌యసాయిరెడ్డి, బీద మ‌స్తాన్ రావు, ఆర్‌.కృష్ణ‌య్య‌, నిరంజ‌న్ రెడ్డిలు బ‌రిలో ఉన్నార‌ని తెలిపింది. ఈ నెల 3న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగియ‌నున్న‌ద‌ని, ఆ గ‌డువు ముగిశాక వీటిపై ఓ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలిపింది. 4 స్థానాల‌కు 4 నామినేష‌న్లే దాఖ‌లైన నేప‌థ్యంలో వారి ఎన్నిక ఏక‌గ్రీవంగానే ముగియ‌నుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com