వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ వేదిక స్థలాన్ని పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు పరిశీలించారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ సమీపంలో గల ఖాళీ స్థలాన్ని వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి , మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పరిశీలించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజు జూలై 8న వైయస్ఆర్ సీపీ ప్లీనరీ మొదలై. 9వ తేదీ సాయంత్రం ముగుస్తుంది. రెండ్రోజుల పాటు ప్లీనరీ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.