విజయవాడలో ఘోర ప్రమాదం తప్పింది. స్వామి కబీ కాలనీ సెంటర్ నందు ఐఓసీ నుండి వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ ను తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టింది కారు. కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఐఓసీ లారీని క్రాస్ చేయబోయే సమయంలో డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కాగా పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.